జనంసాక్షి, కమాన్ పూర్ : రానున్న కాలంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కమాన్పూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి శ్రీధర్ బాబు కి భారీ మెజారిటీ అందించే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు అన్నింటిని రద్దు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా నూతన గ్రామ కమిటీలను ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో చర్చించి అదేవిధంగా శ్రీధర్ బాబు ఆదేశాలతో నూతన గ్రామ కమిటీలు, అలాగే పూర్తి స్థాయి మండల కమిటీ అతి త్వరలోనే కమాన్పూర్ మండలంలో వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు రద్దు – మండల పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు




