జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులకు మంజూరైన దీర్ఘకాలిక ఋ ణాలకు సంభందించిన రూ.23 లక్షల విలువ గల చెక్కులను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పంపిణీ చేశారు. మంథనికి చెందిన శెట్టి సతీష్ కు బోర్ వెల్, పైపులైన్, సబ్ ముర్సిబుల్ పంపుసెట్ కు గానూ రూ.5లక్షలు, సిరిపురం గ్రామానికి చెందిన నల్లవెల్లి శ్రీనివాస్ కు రూ.6 లక్షలు, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన దాసరి రమాదేవికి రూ.3 లక్షలు, చిన్న ఓదాల గ్రామానికి చెందిన నాగుల సమ్మయ్యకు రూ.5 లక్షలు, మోతుకు కుమారస్వామికి రూ.4 లక్షల విలువ గల చెక్కులను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీని వాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాలిక ఋణాల చెక్కులు పంపిణీ చేసిన సింగిల్విండో చైర్మన్




