జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మహాలక్ష్మి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన డ్రైవర్స్ కి ఇన్సూరెన్స్ బాండ్స్, ఐడి కార్డ్ ల పంపిణి కార్యక్రమంలో చంద్రుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని డ్రైవర్స్ కి ఉచితంగా ప్రమాద బీమా బాండ్స్ పంపిణి చేశారుచేశారు. అనంతరం సునీల్ రెడ్డిని శాలువాతో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ..
సమాజంలో డ్రైవర్స్ పాత్ర చాల గొప్పది, ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాని పోషించుకుంటారు.. పోషించుకుంటారు.. ఎల్లప్పుడూ ప్రమాదలతో సహవాసం చేస్తుంటారు..అలాంటి వారికి నా వంతుగా ప్రమాద భీమా చేయించి ఇవ్వడం చాల ఆనందంగా ఉందని అన్నారు. ఇంకా ఎవరైనా ఇన్సూరెన్స్ చేయించుకొని వారు ఎవరైనా ఉంటె తన కార్యాలయ వ్యక్తిగత సహాయకులను సంప్రదించి, వివరాలు వారికి అందజేయాలని అన్నారు. డ్రైవర్ ల కష్టసుఖలలో పలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, డ్రైవర్స్ సోదరులకు ఎల్లప్పుడూ నా వంతు సహాయ, సహకారాలు అందిస్తానని , 12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మార్పు కొరకు పరితపిస్తున్న, గత పాలకుల నిర్లక్ష్యం, అసమర్ధత వల్ల మంథని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని , నియోజకవర్గంలో ఒక్కసారి మార్పు జరిగితే అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్న అని అన్నారు. మన నియోజకవర్గం లో ఒక స్పీకర్, మంత్రిగా ముఖ్య మంత్రిగా, ఒక ప్రధాన మంత్రిగా దశాబ్దాల తరబడి పరిపాలించిన నాయకులు కనీసం ఒక హాస్పిటల్, పరిశ్రమ కూడ మంథనికి తేలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కీసరి సదయ్య ముదిరాజ్, గుర్రాల తిరుపతి, సిలివేరి నరేష్, గుండవేన స్వామి, బందెల శ్రీనివాస్, కుమార్, కే రవీందర్, రేపాక శంకర్, కోశాధికారులు బీ సాగర్, ఎం నరేష్ , నీలి స్వామి, బూడిద గట్టయ్య, రాం శ్రీనివాస్, బూడిద జైపాల్ తో పాటు అధిక సంఖ్యలో డ్రైవర్ లు పాల్గొన్నారు.
డ్రైవర్స్ కి ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తా – బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి




