జనం సాక్షి సైదాపూర్ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ది సాధ్యం అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న… గడపగడప కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రవీణ్ రెడ్డి శనివారం సైదాపూర్ మండలం గుజ్జులపల్లి లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, సరైన న్యాయం జరగాలన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. టిఆర్ఎస్ పాలనలో చిన్న పల్లెలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆర్భాటాలు చేయడం తప్ప గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం లేదని ప్రవీణ్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న తరహా లో మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం అని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల సాయం చేస్తామని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పించన్ రూ. 5000 ఇస్తామని, అధికారం లోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేల సాయం, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ. 12 వేల సాయం అందిస్తామని ప్రవీణ్ రెడ్డి అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ లో చేరిన పలువురు యువకులు, మహిళలకు ప్రవీణ్ రెడ్డి పార్టీ కండువా ను కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి తో పాటుగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రాఘవులు, జిల్లా అధికార ప్రతినిధి మేకల రవీందర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్ట పల్లి కిష్టయ్య, మాజీ మండల అధ్యక్షులు పళ్లేని రవీందర్ రావు, మాజీ సర్పంచ్ లు పోగు రమేష్, జున్నోతుల రాజేందర్ రెడ్డి, దొంత సుధాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు జంపాల కరుణాకర్, నేతుల మధుకర్, గొడిశాల గ్రామ శాఖ అధ్యక్షులు చిట్యాల చంద్ర మౌళి, కాశ బోయిన రవీందర్ , సారాబుడ్ల రాజి రెడ్డి, పల్లే గోపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, సహోదర్ రెడ్డి, మాదం శ్రినివాస్, గూల్ల విష్ణు, అనగొని శ్రీనివాస్ గౌడ్, ఏర్రల శ్రీనివాస్, చల్లూరి రవీందర్, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ది సాధ్యం – హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి




