Monday, 2 November 2026

పోడు భూమి రైతులకు పట్టాలు ఇవ్వాలి

భైంసా రూరల్ జూలై01 జనం సాక్షిభైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర తానూర్ మండలం మొగిలి గ్రామస్తులు నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 50-60 సంవత్సరాల నుండి ఆ భూమిని సాగు చేసుకుంటూ, బ్రతుకుతున్నామని గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిందని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రామ సభలో కూడా సంబంధిత భూమికి పట్టాలిస్తామని, గ్రామ సభలో తీర్మానం కూడా చేయడం జరిగింది. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఆ తీర్మానం చేసినటువంటి పేర్లలో అనర్హులైనటువంటి వాళ్లకి, పార్టీ కార్యకర్తలు అయినటువంటి వ్యక్తులకు అంటే సుమారు వారికి పది నుంచి 15 ఎకరాల భూమి ఉన్న వారికి ఈ మిగతా భూమి ఇవ్వడానికి తీర్మానం చేశారు. దీనికి నిరసనగా వాళ్లు ఆందోళన బాట పట్టాల్సింది వచ్చిందని తెలిపారు. ఆ భూమిని ఒకవేళ భూమి నటువంటి వాళ్లకు ఇస్తే మా దగ్గర ఒక్క గుంట భూమి కూడా ఉండదని మా కుటుంబం వీధిపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి నిరసనకు కాంగ్రెస్ పార్టీ ముదోల్ నియోజకవర్గ ఇంచార్జి శిందే ఆనందరావు పటేల్ సంపూర్ణ మద్దతు తెలియజేసి,మీ వెంట ఉంటామని భరోసానిచ్చారు. రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.