టేకులపల్లి,జూలై 1 (జనం సాక్షి ): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు( ఆదివారం)జరిగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జన గర్జన మహా సభకు టేకులపల్లి మండలం నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు కోరారు. శనివారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశానికి మండలంలోని పదిమంది గ్రామపంచాయతీ సర్పంచ్లు, నలుగురు ఎంపీటీసీలు, ఇద్దరు ఉప సర్పంచ్లు లతో పాటు స్థానిక నాయకులు కోరం సురేందర్, బోడ మంగీలాల్ నాయక్, బానోతు శంకర్, ఉండేటి ప్రసాద్,భిక్కులాల్, మధు, గణేష్, రవి, పోషాలు, సంజయ్, పూణ్య, తారసింగ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జనగర్జన మహాసభను జయప్రదం చేయండి




