కమాన్ పూర్, జనం సాక్షి :కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామములో కాంగ్రెస్ నాయకుడు మతిన్ ఖాన్ ను జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అక్బర్ అలీ పరామర్శించారు.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మతిన్ ఖాన్ తండ్రి మజీద్ ఖాన్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బొంపల్లి రాజయ్య మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అప్సర్ తో పాటు రహీం తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు




