కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలిగా కాల్య స్వాతి..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా కాలియా స్వాతి గారిని నేడు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా

రావు నియామకం చేయడం జరిగింది ఇట్టి సందర్భంగా నూతన అధ్యక్షురాలుగా నియామకమైన కాళియ స్వాతి మాట్లాడుతూ నా యొక్క పనిని గుర్తించి నన్ను పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు నియమించినందుకు నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రజా వ్యతిరేక విధానాల పైన మహిళా హక్కుల కోసం పనిచేస్తూ రాబోవుఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరే విధంగా కష్టపడి పని చేస్తానని అన్నారు. నా యొక్క నియామకానికి సహకరించినటువంటి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెండేలాల్ రాజ్ గార్ల అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.