Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా వైనాల రాజు

 జనంసాక్షి , కమాన్ పూర్ : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల అధ్యక్షులుగా జూలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వైనాల రాజు ను ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియమించారు. శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ సోమవారం నియామక ప్రకటన జారీ చేశారు. వైనాల రాజు గతంలో జూలపల్లి గ్రామ ఉప సర్పంచ్ గా, సర్పంచ్ గా, మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తనదైన శైలిలో కృషిచేస్తూ వస్తున్నారు. వైనాల రాజు పనితీరును, సేవలను గుర్తించిన ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు ఆయన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. తనపై నమ్మకంతో మండల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పిన ఏఐసిసి కార్యదర్శి శ్రీధర్ బాబుకు, దీనికి సహకరించిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుదిల్ల శ్రీను బాబుకు, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కు, జిల్లా కార్యదర్శి సయ్యద్ అన్వర్ కు జూలపల్లి ఎంపీటీసీ శివ శంకరయ్య సీనియర్ నాయకులు బొంపెల్లి రాజయ్య రంగు సత్యనారాయణ గాండ్ల మోహన్ సిలారపు మల్లయ్య కటకం రవీందర్ ఆకుల ఓదెలు తొగరి అశోక్ సాగి శ్రీధర్ రావు చొప్పరి శేఖర్ పెరటి రాజిరెడ్డి చొప్పరి తిరుపతి తదితరులకు వైనాల రాజు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పోయి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.