ముప్కాల్ (జనం సాక్షి ) ఏప్రిల్ 24
వేసవికాలంలో పాఠశాలలు కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి జలాశయాల వద్దకు, చెరువుల కు,వాగులకు, కాలువలకు, కుంటల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.
ముఖ్యముగా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకొనవలెను.
సి.హెచ్ భాస్కర చారి
ఎస్. ఐ. ఆఫ్ పోలీస్ ముప్కాల్
ముప్కాల్ మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు ముప్కాల్ పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి




