వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 06 కాంగ్రెస్ పార్టీ వలిగొండ మండల అధ్యక్షునిగా పాశం సత్తిరెడ్డిని నియమించారు గురువారం టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఆమోదంతో ఈ నియామకాన్ని చేపట్టినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ అభ్యున్నతికి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అహర్నిశలు కృషి చేస్తానని కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ప్రజా సమస్యలపై నాయకులు కార్యకర్తల సహాయ సహకారాలతో నా శక్తి మేరకు పనిచేస్తానని అన్నారు తనను మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడానికి కృషి చేసిన జిల్లా మండల నాయకులు కార్యకర్తలకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు




