Wednesday, 4 November 2026

బెల్లంపల్లిలో జూనోసెస్ డే.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, జులై 6, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని పశువైద్యాశాలలో గురువారం జూనోసెస్ డే నిర్వహించారు. ఈసందర్భంగా పశు సంవర్ధక శాఖ జేడీ రమేష్ మాట్లాడుతూ జంతువులంటే ఇష్టపడని వారుండరని. ఎన్నో ఏళ్లుగా కొన్ని రకాల జంతువులు, పక్షులు మనుషుల ఆదరణ చూరగొంటున్నాయన్నారు. వాటితో మానవులకు విడదీయలేని బంధం ఏర్పడిందని. పాలు, మాంసం, రక్షణ కోసం మానవుడు వాటిపై ఆధారపడుతున్నాడని అన్నారు. జంతువులు, పక్షుల నుంచి రేబిస్, మెదడువాపు, బర్డ్‌ ఫ్లూ, ఎబోలా, ప్లేగు, ఆంథ్రాక్స్‌ వంటి అనేక రకాల వ్యాధులు మానవుడికి సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటికి సకాలంలో టీకాలు వేయించడం వల్ల వాటి నుంచి వ్యాధి సంక్రమణను నిరోధించవచ్చన్నారు. ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ డేను పురస్కరించుకుని పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు అందిస్తున్నామన్నారు. బెల్లంపల్లి పట్టణంలో సుమారు 90 పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి పశువైద్యాధికారి సుజాత, నెన్నెల పశువైద్యాధికారి దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు.