Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీ లోనే దేశం అభివృద్ధి

కాంగ్రెస్ పార్టీ లోనే దేశం అభివృద్ధి
జహీరాబాద్ డిసెంబర్ 29 (జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశం అభివృద్ధి సాధ్యం అని జహీరాబాద్ పార్లమెంట్ మెంబర్ షిప్ ఇంచార్జ్ బొల్లుకిషన్ అన్నారు.గురువారం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి, డా.జె. గీతారెడ్డి ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణంలో జహీరాబాద్ బ్లాక్ అధ్యక్షుల ఆధ్వర్యంలో హత్ సె హత్ జోడో అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులకు గా పని చేయాలన్నారు. ఈకార్యక్రమంలో డిజిటల్ మెంబర్ షిప్ జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ బొల్లుకిషన్,జహీరాబాద్ ఎంపిపి అధ్యక్షులు.గిరిధర్ రెడ్డి, ఝరా సంగం మండల పార్టీ అధ్యక్షులు,హన్మంత్ రావ్ పాటిల్,ఖండ్యం నర్సింలు, పి.నర్సింహారెడ్డి, పి.రామలింగ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మొహ్మద్ మాక్సుద్, అధ్యక్షులు, ప్రియాంకా గుండారెడ్డి, దేవదాసు, కుమారి మాధవి నర్సింలు, మాజీ మరియు ప్రస్తుత మాజీ జడ్పీటిసి భాస్కర్ రెడ్డి, వినీల నరేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, నాగిశెట్టి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హర్షద్ అలీ, శమేల్, యూత్ కాంగ్రెస్ అద్యక్షులు నరేశ్ గౌడ్, సర్పంచ్ లు, గ్రామాధ్యక్షులు, భుత్ ప్రెసిడెంట్ లు కౌంస్లర్ లు, వార్డు ఇంచార్జ్ లు, మహిళా కాంగ్రెస్,ఎస్సి ఎస్టీ బిసి కిసాన్, మైనార్టీ సెల్ నాయకులు,కో అపరేటివ్ చైర్మన్ లు, డైరెక్టర్ లు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.