ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు ను సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేయాలి
జహీరాబాద్ డిసెంబర్ 29 (జనం సాక్షి) ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు ను సరఫరా చేసిన బిల్లుల ను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ బాధితులు ఆర్ డబ్ల్యూ ఎస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్ డబ్ల్యూ ఎస్ డి ఈ సాబేర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలు క్రితం త్రాగునీరు ను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశామని ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని అన్నారు. అప్పులు చేసి నీరు సరఫరా చేస్తే మాకు ఇపుడు తిప్పలు తప్పడంలేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే మాకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తట్టు నారాయణ, రాజేందర్ సింగ్, అమృత్ పటేల్.గంగారాం నర్సిములు, ,మైపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి, అశోక్ రెడ్డి గ్గులబ్ షా, అనిల్ రవేందర్ సింగ్ నియోజకవర్గంలో ని ఝరాసంగం జహీరాబాద్, మొగుడం పల్లి కోహిర్, న్యాలకల్ మండలం లోని ఆయా ట్యాంకర్ల యజమానులు ,తదితరులు పాల్గొన్నారు.
ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు ను సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేయాలి




