
మర్పల్లి జూలై 05 (జనం సాక్షి) రాష్ట్రం ప్రజలు వచ్చి ఎన్నికలో బిఅర్ఎస్ పార్టీ ని చరమగీతం పారడం ఖాయమని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో బిఆర్ఎస్, బిజెపి, పార్టీల నుండి సుమారు 40 మంది కార్యకర్తలు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ సమక్షంలో చాకలి సురేష్, అవసలి సంతోష్, ఎ. వీరారెడ్డి, పన్నేగారి వికాస్ రెడ్డి, మాలే రాజు గౌడ్, గొల్ల ప్రవీణ్, మహాంత్ రెడ్డి, అర్కతల మల్లేష్, రామన్న గారి పిచ్చి రెడ్డి, బిఆర్ఎస్ నుండి మైనార్టీ నాయకులు రఫీ యుద్దీన్ లలాహమ్మడ్, అబ్దుల్, షరీఫ్, బషీర్, రాహఫ్, సయ్యద్ సలీం, ఇబ్రహీం, సుధాకర్, అనంతయ్య, కస్లాబాద్, రత్నయ్య, నాగళ్ళ, లాలు, ప్రవీణ్, నర్సింలు, అనిల్, నిమ్మగళ్ళ ప్రకాష్, నాగల్ల ప్రసాద్, బాలు, మామిళ్ళ ప్రవీణ్ తదితరులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ, 500 కే గ్యాస్, ఎకరాకు 15వేల రూపాయల రైతుబంధు, 18 సంవత్సరాల పైబడి విద్యనభశిస్తున్న విద్యార్థినిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్, నిరుపేదలకు సొంత స్థలం ఉంటే కట్టుకోవడానికి ఐదు లక్షల, వృద్ధులు వితంతువులకు నెలకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యు. రవీందర్ మండల పార్టీ అధ్యక్షుడు, మర్రి లక్ష్మారెడ్డి కార్యనిర్వాక అధ్యక్షుడు, డి సురేష్, ఎంఎస్ సలీం, జి. గోపాల్, కుమ్మరి సర్వేష్, చామల రఘుపతి రెడ్డి, ఎం. మహేష్, తులసీదాస్, మర్రి రాజిరెడ్డి, నాయకులు ఏం. సంగమేశ్వర్, మొగిలిగుండ్ల రాజు, బి. వెంకట్రాంరెడ్డి, బి. బల్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




