జనం సాక్షి సైదాపూర్ హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. బుధవారం రోజున వే-సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి డప్పుచప్పులతో మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. 20 లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి,20 లక్షల వ్యయంతో నూతన పల్లె దవాఖాన నిర్మాణానికి,5 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి మొత్తం 45 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం సభలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎలాబోతారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని గ్రామంలో మిగిలి ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఇది మా అమ్మమ్మ గారి ఊరు నాకు ఎంతో అనుబంధం కలిగినదని ఇక్కడ ప్రజలందరూ నా వాళ్లు అని అన్నారు. దళిత బంధు అందరికీ ఇచ్చేందుకు కృషి చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలో పూర్తిచేసి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ అందిస్తామన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గారు అందించారు.అనంతరం రాములపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ చేసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి ఎలబోతారం గ్రామంలో 45 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,భూమి పూజ




