కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
బేల, డిసెంబర్ 28 ( జనం సాక్షి ) మండల కేంద్రము లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పైజుల్లా ఖాన్ మాట్లాడుతూ అమరుల త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని పేర్కొన్నారు.ఎక కాలం లో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాందాస్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సామ రుపేష్ రెడ్డి,వామన్ వాన్కడే, సంజయ్ గుండావార్, మాజీ సర్పంచ్ రూప్ రావ్, ఎండీ అఖిల్, శంకర్ బోక్రే, రాజు తదితరులు పాల్గొన్నారు…
కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు




