టేకులపల్లి లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138వ విర్భావ దినోత్సవం
టేకులపల్లి, డిసెంబర్ 28( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు భూక్యా దేవ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గద్దెపై జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు అయిన సందర్భంగా ఘనంగా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భూక్యా దేవా నాయక్ మాట్లాడుతూ 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క 138 ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడతు బ్రిటిష్ పరిపాల నుండి విముక్తి పొందడానికి ఆనాడు 1885లో డిసెంబర్ 28వ తారీఖున కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి చెందామంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్నారు.
బ్రిటిష్ పరిపాలన అధికారులను ఎదిరించి ఎందరో కాంగ్రెస్ పార్టీ మహానుభావుల త్యాగ ఫలితం తోనే స్వాతంత్ర సిద్ధించిందని అన్నారు. బీజేపీ,టిఆర్ఎస్
ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అవగాహన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరమని, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ప్రత్యేక తెలంగాణను కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేనని టిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకొని మసులుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బేతంపూడి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు,
రాస మల్ల నరసయ్య , మాజీ సర్పంచ్ ఇస్లావత్ రెడ్యా నాయక్, భూక్య రవీందర్ సింగ్ నాయక్, మహిళా మండల అధ్యక్షురాలు ఆకారం స్వప్న ,
జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు భూక్య చంద్రకళ , ఈసం ప్రసాద్,పునెం లవ్ కుమార్,
భూక్య బన్సీలాల్, బాలాజీ, ఆదామ్, బోడ భీము డు, అజ్మీర సుక్య , బల్లెం ప్




