Friday, 6 November 2026

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు :శామీర్ పేట్, జనం సాక్షి : బుధవారం
రోజు కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా(తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో) కాంగ్రెస్ పార్టీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమము నిర్వహించారు.సింగాయిపల్లి,హకీంపేట్,దేవరయాంజాల్,ఉప్పర్ పల్లి, తూంకుంట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ జెండాల ఆవిష్కరణ చేశారు .అదేవిధంగా మాజీ సీఎల్పీ నాయకులు పి.జనార్ధన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు .
ఈ కార్యక్రమాలలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి ,తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళి గౌడ్ ,యాదగిరి , శ్రీనివాస్ యాదవ్ ,లక్ష్మీ నారాయణ గారు,జనార్దన్ రెడ్డి ,భరత్ సింగ్,జగన్ , జాఫర్ ,మల్లేష్ గౌడ్ , దుర్గయ్య ,రవీందర్ గౌడ్ , బాబు ,పాండు గౌడ్ , లక్ష్మణ్ , పాండు , కృష్ణ , మైసయ్య ,బాలరాజు ,సత్యనారాయణ ,యూత్ కాంగ్రెస్ నాయకులు జగదీష్ గౌడ్ ,శేశాంత్, భరత్ ,తదితరులు పాల్గొన్నారు.
28ఎస్పీటీ -1: ఆవిర్భావ దినోత్సవల్లో కాంగ్రెస్ నాయకులు