Tuesday, 3 November 2026

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదలకు న్యాయం సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్

జనం సాక్షి, చెన్నరావు పేటతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని లింగాపురం సర్పంచ్,మండల కాంగ్రెస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ అన్నారు. ఖమ్మంలో నేడు జరుగనున్న తెలంగాణ జన గర్జన సభకు నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో లింగాపురం నుండి కాంగ్రెస్ పార్టి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్బంగా సర్పంచ్ తప్పేట రమేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రముగా ఏర్పడి పది సంవత్సరాలు దాటినా పేదోడికి న్యాయం జరుగలేదని మన నీళ్లు,నిధులు,నియామకాలు అనే నినాదంతో నాడు విద్యార్థులు,సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒరిగిందేమి లేదని, సకల సంపదలు మొత్తం కెసిఆర్ కుటుంబం, బిఆర్ఎస్ నాయకులే దోసుక తిన్నారని దళితులకు మూడేకరాల భూమి,డబల్ బెడ్రూమ్ ఇండ్లు,నిరుద్యోగ భృతి,ఇలా ఎన్నో మోసాలు చేసారని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతి చేసి డోసుకున్నారని దళిత బంద్ పేరుతో దళితులను, బీసీ లోన్స్ పేరుతో బీసీలను తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూన్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు న్యాయం చేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాపురం గ్రామ పార్టి అధ్యక్షులు మచ్చిక కుమారస్వామి, మాజీ సర్పంచ్ మందాటి కుమారస్వామి,మాజీ పిఏసిఎస్ వైస్ చైర్మన్ రాజబోయిన దూడయ్య, చిన్న గురిజాల ఉప సర్పంచ్ రాగిరి కమలాకర్,మాజీ డైరెక్టర్ తప్పేట సూరయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కామగోని సూరయ్య,పండుగ నరేందర్ వెంగళదాసు రామ్మూర్తి, వెనుకతల ఇంద్రయ్య, అమిరెడ్డి కర్ణాకర్,కంది రవి,తాడేం శంకర్, ముత్యాల మల్లయ్య, ముత్యాల శ్రీనివాస్, నిమ్మనబోయిన యాకయ్య, మైదం సతీష్,మూగల రాజుకుమార్,అజ్మీర రమేష్ ముదిగొండ బాబు,తప్పేట కోటేశ్వర్,తప్పేట అఖిల్, గడ్డం వేణు రెడ్డబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.