జనం సాక్షి,చెన్నారావుపేటతెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి పట్ల బిఅర్ఎస్ యువ నాయకుడు కంది కృష్ణ చైతన్య,చెన్నారావుపేట ఎస్సీ కాలనీ బిఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచందని కొనియాడారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని యువ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద బర్ల దేవదాసు, బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్మెట సాంబయ్య,పసునూరి యాకూబ్,సామెల్, కొంకటి రవి,తీగల అశోక్,ఉప్పునూతల రాజు, పందిర్ల రాజేందర్ ,చాతల్ల వెంకటస్వామి,జంగిలి కిరణ్,మందుల సాగర్, సింగిరెడ్డి అనిల్,ఆకులపెళ్ళి సుదర్శన్,అజయ్,ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు బారపక నవీన్, జంగిలి అజయ్,ప్రదీప్,సాధు శివ,అందే ప్రవీణ్,జంగిలి ప్రవీణ్, దిలీప్,సతీష్,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం




