మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 2యూనియన్ల కతీతంగా మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి జర్నలిస్టులు సహకరించాలని మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ ఐజెయు,143 అధ్యక్ష,కార్యదర్శులు పిలుపు నిచ్చారు.ఆదివారం నేరెడ్ మెట్ లోని నూతనప్రెస్క్లబ్భవననిర్మాణంజరుగుతున్న ప్రదేశంలో యూనియన్ లకు అతీతంగా మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె ఐజేయు,143 ప్రతినిధులు పాల్గొన్నారు.ఈసందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం,జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అందించిన భూమి,జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకోవలసిన చర్యలు మొదలైన అంశాలపై కూలంకుషంగా చర్చించారు.రెండు యూనియన్ సభ్యుల ఆమోదంతో నేడు సోమవారంఉదయం నెరెడ్ మెట్ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం దగ్గర 11గంటలకు తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు సర్కిల్ జర్నలిస్టులు యూనియన్ లకు అతీతంగా హాజరై కలిసి కట్టుగా వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో రెండు యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.




