Wednesday, 4 November 2026

కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం – గొల్లపల్లిలో పర్యటించిన దుదిల్ల శీను బాబు

 

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుదుల్ల శీను బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామప్రజల సమస్యలను శ్రీను బాబు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఒక మహిళ సిలిండర్ ధర పెద్ద మొత్తంలో పెంచారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని శ్రీను బాబు దృష్టికి తీసుకువెళ్లగా.. అక్కడ మోడీ. .ఇక్కడ కేసీఆర్..పాలన గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని, దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు, గొల్లపల్లి సర్పంచ్ సిలారపు అనిత మల్లయ్య తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.