చేవెళ్ల : కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రూపపకల్పన జరిగిందని తేరాస అధినేత కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ రోజు సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూడు తరాలు మారినా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక చేవెళ్లను నొయిడా, గుర్గావ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కొందూరు వద్ద 100 టీఎంసీల సామర్థ్యం గల ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.




