హైదరాబాద్ జనంసాక్షి : హైదరాబాద్ పాతబస్తీలో కాంట్రాక్ట్ మ్యారేజీ గుట్టురట్టయింది. రూ. 80 వేల కోసం 15 రోజులు మ్యారేజీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సోమాలియా దేశస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ మ్యారేజీకి ఒప్పందం జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కాంట్రాక్ట్‌ని భగ్నం చేయడంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేశారు.




