ముంబై : డేరింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌కు వరల్డ్‌కప్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వరల్డ్‌కప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కని యువీకి వరల్డ్‌కప్ దుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని క్రీకెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వరల్డ్‌కప్ పైనల్ జట్టులో చోటు దక్కిన రవీంద్ర జడేజా రేపు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.
ఒక వేళ జడేజా అన్ ఫిట్ అయితే యువరాజ్‌కు చాన్స్ దక్కినట్లేనని బావిస్తున్నారు. జడేజాకు ఫిట్‌నెస్ పరీక్షల అనంతరం అతని పరస్థితి చూసి యువరాజ్‌కు ఛాన్స్ గురించి ఆలోచించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జడేజా అన్‌ఫీట్ యువీకి కలిసొస్తుందో లేదో చూడాలి.




