కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు పట్టవా!
` వారికి ఇప్పటికీ అందని జీతాలు: కెటిఆర్
హైదరాబాద్(జనంసాక్షి): ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కనిపించడం లేదా.. అని నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిరదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేవ్ అని తెలిపారు. పంచాయతీ వర్కర్స్, మున్సిపాలిటీ కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్.. ఇలా ప్రతీ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు విలవిలలాడిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగులు కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని పలికిన ప్రగల్భాలు ఎటుబాయె..? దసరా దగ్గరికి వచ్చింది..సరుకులు కొనడానికి చేతిలో నయాపైసా లేదు..! నెలల తరబడి వేతనాలు పెండిరగ్‌లో డితే బతుకు బండి నడిచేదెట్లా..? 10 నెలల్లో తెచ్చిన రూ. 80 వేల కోట్లు అప్పులు ఎక్కడికి పోయినయ్..? చిరుద్యోగులు.. చిన్నజీతాల కార్మికుల అవస్థలను పట్టించుకోండి..వెంటనే వేతనాలు చెల్లించండి అని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు.హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని అంశాలు స్పష్టంగా తెలిశాయన్నారు.2029లో భాజపా, కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా ఉంటాయని.. తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దశాబ్దం, అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు అంటూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.’గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ గ్యారంటీలు అబద్ధమని హరియాణా ప్రజలు విశ్వసించారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.