Wednesday, 4 November 2026

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 03,( జనంసాక్షి ): తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా శనివారం రోజున మెట్పల్లి పట్టణ కేంద్రంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకాంతా చారి లాంటి ఎంతో మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ పోరాటానికి ఆయన చేసిన ప్రాణ త్యాగమే ఈరోజు తెలంగాణ వచ్చిందని దీనిని తెలంగాణ ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ శ్రీకాంత్ చారి పోరాటం త్యాగం గుర్తు చేసుకుంటారని తెలంగాణ వచ్చాక వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదరించకపోవడం శోచనీయమని ప్రభుత్వం అన్ని విధాల వారి కుటుంబాన్ని ఆదుకొని ఆయన విగ్రహాన్ని మెట్పల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి ,ఇల్లెందుల కృష్ణమాచారి ,నాంపల్లి శ్రీనివాస్, వంగళ మహేష్, తిప్పర్తి వెంకటేష్, నాంపల్లి రాజేందర్, మురళి, నాగరాజు, నాంపల్లి సంజీవ్ లక్ష్మణ్, శ్రీరామోజుప్రవీణ్ ,నాంపల్లి రాజేందర్ , ఇల్లెందుల శ్రీనివాస్, శ్రీపాద సతీష్ ,బెజ్జారపు మురళి, తిరుమలచారి, నాగరాజు, ఆనందు, వెంకటేశ్ ,సంజీవ్, శ్రీపాద సతీష్ ,హరీష్, కృష్ణ ,శ్రీధర్ తదితరుల స్వర్ణకార సంఘ కుల బాంధవులు పాల్గొన్నారు.