రైతు సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి
కొడకండ్ల, డిసెంబర్05(జనంసాక్షి)
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ దరవత్ జ్యోతి, జిల్లా రైతుబంధు సభ్యులు,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ అన్నారు. మండలంలోని రామవరం గ్రామంలో ఎఫ్ ఎస్ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమ వారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి ఎస్ వైస్ ఛైర్మన్ మేటి సోమరములు, స్థానిక సర్పంచ్ మందుల శిరీష్-మల్లేష్, మల్లారెడ్డి, రమేష్,కొమురయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.




