Friday, 6 November 2026

కాందిశీకులకు పని కల్పించండి

హైదరాబాద్‌: విశాఖపట్నం జిల్లా పాడేరులో శ్రీలంక కాందిశీలకులకు పని కల్పించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. తక్షణం జోక్యం చేసుకుని వారికి పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇటీవల పాడేరు పర్యటనకు వెళ్లినప్పుడు కాందిశీకులు తనను కలిశారని, వారి పాస్‌పోర్ట్‌ల్ని తాను పరిశీలించగా వారికి అక్కడి కాఫీ తోటల్లో పని కల్పిస్తున్నట్లు నమోదు చేశారని వివరించారు. అయితే ఆ హామీ అమాలు కాలేదని, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *