ఆత్మహత్యాయత్నంకొత్తగూడెం ఆస్పత్రికి తరలింపు
జూలూరుపాడు, జనవరి 22, జనంసాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, కాకర్ల గ్రామానికి చెందిన మందనపు సురేష్ అనే వ్యక్తి గానుగపాడు వెళ్లే రహదారి పక్కన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రోధిస్తుండగా అటుగా వెళుతున్న కొందరు గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడ చేరుకుని తీవ్ర గాయాలతో ఉన్న సురేష్ ను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అప్పుల బాధ తట్టుకోలేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది.
కాకర్లలో వ్యక్తి ఆత్మహత్యాయత్నంకాకర్లలో వ్యక్తి




