Thursday, 5 November 2026

గాంధీభవనంలో మహిళా కాంగ్రెస్ సమావేశంలో దేవి ప్రసన్నగాంధీభవనంలో మహిళా కాంగ్రెస్ సమావేశంలో దేవి ప్రసన్న

టేకులపల్లి, జనవరి 22( జనం సాక్షి ): హైదరాబాదులోని గాంధీభవన్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు  అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏ ఐ సి సి కార్యదర్శి బోస్ రాజు పాల్గొని సమావేశంలో హాత్ సే హాత్ జోడో గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా డిసీసీలు పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం మహిళా లోకాన్ని కదిలించడానికి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం మహిళా కాంగ్రెస్ నాయకురాలు తీవ్రంగా కృషి చేయాలని సమావేశంలో పలువురు సూచించారు. కాంగ్రెస్ పార్టీ కృషి కోసం పనిచేస్తున్న పలువురు మహిళ నాయకురాళ్లను సమావేశంలో అభినందించారు.