Wednesday, 4 November 2026

కాచిగూడలో భారీ అగ్నిప్రమాదం

తృటిలో తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): నగరంలోని కాచిగూడలో ఓ బట్టల షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ క్రాస్‌ రోడ్‌ సవిూపంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌, మొదటి అంతస్తులో ఫ్యాషన్‌ కార్నర్‌ బట్టలు, ఫుట్‌వేర్‌ షోరూమ్‌లు ఉన్నాయి. బట్టల షోరూమ్‌లో మంటలు అంటుకుని భారీ.. అగ్నికీలకు ఎగసిపడ్డాయి. మంటలు మొత్తం బిల్డింగ్‌ అంతా వ్యాపించాయి. సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పింది. మంటలు అంటుకున్న బిల్డింగ్‌ పై అంతస్తులో ఓ లాడ్జి ఉంది. అందులో చిక్కుకున్న 10 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.