కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..?
******
సైదాపూర్ జనం సాక్షి జనవరి 16 వందే భారత్ రైలు ప్రారంభించడం బాగానే ఉందని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ప్రారంభిస్తారని బిజెపి పార్టీ నాయకులను మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు ప్రశ్నించారు. వందే భారత్ రైలు వల్ల సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఆయన మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ… విభజన హామీలను పక్కనపెట్టి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగా లను నిరుద్యోగులకు కల్పించాలని, ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఎనిమిది ఏళ్లకు 16 కోట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది.




