Thursday, 5 November 2026

జనవరి 19 నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం .

జనవరి 19 నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం .

రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

జనవరి 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభం.

 

 

కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు సమీక్ష.

సిరిసిల్లబ్యూరో. , జనవరి 16,(జనం సాక్షి).
జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు.సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి , రాష్ట్ర సీఎస్ శాంతికుమారి , డీజిపి అంజనీ కుమార్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు హైదరాబాద్ బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యల పై అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమం అని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని మంత్రి తెలిపారు. జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారనితెలిపారు.జిల్లాలలో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు,జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు వారి పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శుల, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్.పి లు, విఒఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలని, ప్రజలు ఉదయం , మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు నిర్వహిస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రణాళిక బద్ధంగా ప్రజలు క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ కు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ నుండి కలెక్టర్ అనురాగ జయంతి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా స్థాయిలో కంటి వెలుగుపై అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.