కానూరు ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం
విజయవాడ,మే10(జనం సాక్షి): విజయవాడలోని కానూర్‌లోని ప్లాస్టిక్ కంపెనీ గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని ప్లాస్టిక్ అగ్నికి ఆహుతి కావడంతో పాటు పక్కనే ఉన్న ఆయిల్, అట్టపెట్టల పరిశ్రమలకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పక్కనే ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీకి మంటలు విస్తరించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. ముందస్తు చర్యగా అధికారులు విద్యుత్‌ను నిలుపుదల చేశారు.