Thursday, 5 November 2026

రేవంత్‌ వ్యాఖ్యలపై చిచ్చు

  మండిపడ్డ కోమటిరెడ్డి
హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  తెలంగాణకు ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమంటూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుబట్టారు. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోని సీనియర్లను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని బంగారం చేస్తానన్న రేవంత్‌ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. అంత సత్తా ఉంటే టిడిపినే బంగారం చేసి ఉండాల్సిందని చెప్పారు. తనకు దీక్ష చేయాలని రేవంత్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకపోతే ఇదే విషయమై పొంగులేటి సుదాకర్‌ రెడ్డి కూడా ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చారు.