జుక్కల్, ఎప్రిల్ 14,( జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలం మల్లాపూర్ విఆర్ఎ తాడకోల్ అశోక్( 45) శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.వివరాలు ఈ విధంగా ఉన్నాయి.గురువారం అధికారుల ఆదేశం మేరకు సాయంత్రం మూడు గంటలకు విదుల నిమిత్తం మద్నూర్ వచ్చి ఇక్కడే మద్యం సేవించి తహాశీల్ కార్యాలయం వెళ్ళేదారిలో పడుకున్నాడు.శుక్రవారం ఉదయం అతడిని లేపి చూడగా కదలక పోవడంతో స్ధానిక ఆసుపత్రికి పోలీసులు తరలించారు. డాక్టర్ లు అతడిని పరిశీలించి చనిపోయినాడని నిర్దారించారు.




