63 వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం
ఒకేసారి 638 పోలీసు స్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్
యాప్‌తో ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది
వెల్లడింజిన డిజిపి మహేందర్ రెడ్డి
హైదరాబాద్,జూన్18(జనం సాక్షి): తెలంగాణలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు, నేర రహిత రాష్ట్రం కోసమే కాప్ కనెక్ట్ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాప్ కనెక్ట్ యాప్‌ను సోమవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్కన పోలీస్‌కు కూడా సమాచారం వెళ్లడం వల్ల విసయం త్వరగా చేరగలదన్నారు. పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది వరకు సమాచారాన్ని చేరవేసేందుకు, అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ‘కాప్ కనెక్ట్’ పేరుతో డీజీపీ మహేందర్ రెడ్డి ఒక వాట్సప్ గ్రూప్‌ను సోమవారం ప్రారంభించారు. కేవలం పోలీసుల కోసమే ఈ ప్రత్యేక వాట్సప్ గ్రూప్ రూపొందించారు. మొత్తం 31 జిల్లాల 63 వేల మంది సిబ్బందికి ఏకకాలంలో సమాచారం అందించేందుకు ఈ వాట్సప్ గ్రూప్ ఉపయోగించనున్నారు. సాధారణ వాట్సప్ గ్రూప్‌లాగే ఇందులో చాటింగ్, ఆడియో, వీడియో, లొకేషన్ షేరింగ్ చేయవచ్చు. పోలీస్ నెట్‌వర్క్‌లో ఉన్న ఫోన్‌లకు మాత్రమే ఈ గ్రూప్ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీలో భాగంగా పోలీసింగ్ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.తెలంగాణలోని 63 వేల మంది పోలీసులకు సమాచారం త్వరితగతిన చేరవేసేందుకు కాప్ కనెక్ట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లో 60 వేల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. వాట్సాప్ ఒక్కో గ్రూప్‌లో గరిష్టంగా 256 మందికే సభ్యులుగా ఉండే అవకాశం ఉందన్నారు. కానీ కాప్ కనెక్ట్ ద్వారా 63 వేల మంది ఒకే గ్రూప్ ఏర్పాటు చేయొచ్చు అని తెలిపారు.ఈ యాప్ ద్వారా ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు సమాచారం చేరవేసే అవకాశం ఉందన్నారు. పోలీసు శాఖలోని 17 విభాగాల్లో కాప్ కనెక్ట్ ద్వారా అనుసంధానం కావొచ్చన్నారు. బయటివారికి ఇందులో అనుసంధానం అయ్యే అవకాశం లేదన్నారు. ఈ యాప్‌లో వీడియో కాన్ఫరెన్స్ సౌలభ్యం కూడా ఉందని డీజీపీ వెల్లడించారు. కాప్ కనెక్ట్‌లో 638 పోలీసు స్టేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఏకకాలంలో అంతర్గత సమాచారం పంచుకోవడానికి అనేక అంశాలు పొందుపర్చాం. అభిప్రాయాలు పంచుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.




