రంగసాయిపేటలో అయ్యప్ప మహా పడిపూజ
వరంగల్ ఈస్ట్, డిసెంబర్ 15(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో గురువారం స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా పరపతి సంఘం ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు సంఘం అధ్యక్షులు కొల్లూరి యోగానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పడిపూజ కార్యక్రమాన్ని వెళ్లిదే ప్రదీప్ శర్మ గురుస్వామి నరసింహమూర్తి భార్గవ శర్మ లతోపాటు శ్రీధర్ ఆచార్యులు స్వామి వారి పడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు పడిపూజ కార్యక్రమానికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎర్రబెల్లి ప్రదీప్ రావు దంపతులతో పాటు స్థానిక కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్ కత్తి ఎల్లా గౌడ్ కొండ్రెడ్డి నవీన్ రెడ్డి సోమ అనిల్ సోమ మనోహర్ శ్రీపాద మనోహర్ కుంట శ్రీధర్ తోపాటు అయ్యప్ప సేవా పరపతి సంఘం సభ్యులు అయ్యప్పలు పాల్గొన్నారు




