Tuesday, 3 November 2026

కామారెడ్డి జిల్లా పశు సమర్థక శాఖ అధికారిగా కె. సింహారావు

 

 

 

 

 

 

 

కామారెడ్డి ప్రతినిధి మే2 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా పశు సమర్థక శాఖ అధికారిగా కె. సింహారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇంచార్జ్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా పని చేసిన భరత్ కుమార్ నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ ఏడిఏ గా బదిలీపై వెళ్లారు. హైదరాబాదులో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన సింహ రావు ఇక్కడికి బదిలీపై వచ్చారు.