Tuesday, 3 November 2026

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం….
కామారెడ్డి ప్రతినిధి నవంబర్29 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు పాలాభిషేకం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ సేల్స్ టాక్స్ (సి,యస్,టి,) తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్లు చెల్లించవలసిన
బకాయిలను రద్దు చేస్తూ సీఎం కెసిఆర్ నిర్ణయం తీసుకన్న సందర్భంగా కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల లింగం, ప్రధాన కార్యదర్శి పప్పుల రాజేంద్రప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ భూమేష్, రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు