రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా రాజేష్ ఖన్నా
వరంగల్ ఈస్ట్, నవంబర్ 29(జనం సాక్షి)
ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలలో నూతనంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా వరంగల్ నగరానికి చెందిన రామా రాజేష్ ఖన్నా ను మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ ఖన్నాకు నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేశారు.




