హుజూర్ నగర్ మే 19 (జనంసాక్షి): కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని నియోజవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ బి ఆర్ టి యు అనుబంధ సంఘం రైస్ మిల్ డైవర్స్ యూనియన్ రోజువారి కూలీ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత రైతాంగ సాయుధ పోరాట యోధులు నిస్వార్థపరుడు నిరాడంబరుడు పేద ప్రజల పెన్నిధి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతకాయల మల్లయ్య, రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు సెలగాలి సైదులు, సెక్రెటరీ ఎర్రయ్య, లింగయ్య, రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ ముఖ్య కార్మికులు, రోజువారి కూలీ అధ్యక్షురాలు సైలమ్మ, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం




