వికారాబాద్, జనంసాక్షి : రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతూ పేస్కేలు ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 వేల కుటుంబాలకు వెలుగు నింపినందుకు వారికి ఈ రోజు ప్రతి మండలాలలో పాలాభిషేకం చేయడం జరిగింది.దాంట్లో భాగంగా వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణ కేంద్రంలో వికారాబాద్ జిల్లా వీఆర్ఏ జేఏసీ చైర్మన్ గోపాల్ మరియు శ్రీనివాస్, సంధ్యారాణి, ప్రవీణ్, మోహన్, ఆంజనేయులు, నరసింహులు, ఇతర వీఆర్ఏ మిత్రులు వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొని కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం




