కారులో చెలరేగిన మంటలు
హైదరాబాద్: హయత్‌నగర్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై వెళుతున్న ఫోర్డు కారులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. రోడ్డు పక్కకు కారును ఆపిన యజమాని సురక్షితంగా బయటపడ్డాడు. కాలిపోతున్న కారు నుంచి దట్టమైన పొగలు రావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.



