రసమయి బాలకిషన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన కవి,గాయకుడు పడిదం రాజేందర్
జనం సాక్షి, చెన్నరావు పేట
మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సాంస్కృతిక సారధి కళాకారుడు, కవి గాయకుడు పడిదం రాజేందర్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ధూంధాం వ్యవస్థాపక అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్, పాటల పెద్దన్న రసమయి బాలకిషన్ పై కొంతమంది దుండగులు ఆయన కాన్వాయ్ పై దాడి చేయడం ప్రజాస్వామికంగా భావిస్తున్నామని అన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించే నాయకుడు ఆటపాటలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకతాటిపై నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కృషి చేసిన మహనీయుడు రసమయి బాలకిషన్ అని, ఇలాంటి వ్యక్తిపై దాడులు జరగడం బాధాకరమని అన్నారు.ఎవరైతే ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారో వారిని గుర్తించి వెంటనే చట్టరీత్యా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుడు బరిగల రవీందర్ పాల్గొన్నారు.




