మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ పల్లా దేవేందర్ రెడ్డికొండమల్లేపల్లి ఫిబ్రవరి 10 (జనంసాక్షి) న్యూస్ :హాస్పిటల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని ఏఐటీయూసీ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ రాములు నాయక్ మరియు డాక్టర్ రవి సంయుక్తంగా మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం నిత్యం యూనియన్ అండగా నిలిచి పోరాడుతుందని పేర్కొన్నారు. హాస్పిటల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కార్మికులందరి పర్మినెంట్ చేయాలని దేవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, డివిజన్ కోశాధికారి జే వెంకట రాములు, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి ఏ మల్లయ్య, హాస్పిటల్ యూనియన్ కార్యదర్శి రామేశ్వరమ్మ, ప్రణయ్, అభిషేక్, తారమ్మ ,కాశయ్య, భద్రమ్మ ,రాణి ,బుజ్జి ,కవిత, అరుణ తదితరులు పాల్గొన్నారు.




