Wednesday, 4 November 2026

సమస్యల నిలయం…. హామీలు విఫలం

 

 

 

 

 

 

ఎమ్మెల్యేలకు దళిత బంధు ఆదాయ పథకమైంది రాష్ట్రాన్ని బీర్లు….. బార్లు గా మార్చిన ఘనత బీ ఆర్ ఎస్ దే

, ప్రజాగోస…. భాజపా భరోసా సమావేశంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ రామారావు ఆరోపణలుమానకొండూరు, ఆర్ సి, ఫిబ్రవరి 10 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్రం అరాచక శక్తులకు ,ముఠామేస్త్రీలకు, దగాకోరుల వశమైందన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ రామారావు. ఇసుక, భూమాఫియా, లిక్కర్ దందాల్లో ఆరితేరిన ఘనాపాఠీ లు సెటిల్మెంట్ల రారాజులు భారత రాష్ట్ర సమితి నాయకులని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో ఊరు రా బెల్ట్ షాపులు తెరిచి బార్లుగా నిర్వహిస్తున్న ఘనత భారాస శాసనసభ్యుల, మంత్రుల దేనని ఎద్దేవా చేశారు. బార్లతో, బీర్లతో ప్రజలను మద్యానికి బానిసలుగా చేశారన్నారు. శుక్రవారం మాన కొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజాగోస…భాజపా భరోసా నినాదంతో నిర్వహించిన కూడలి (స్ట్రీట్ కార్నర్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను, తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. తెలంగాణ వచ్చేదాకా సొంత కారు లేని కేసీఆర్ నేడు హెలిక్యాప్టర్లు, ఫామ్ హౌస్ లకు ఎలా యజమాని అయ్యాడో చెప్పాలని నిలదీశారు. కెసిఆర్ కు 500ల ఎకరాలు, అల్లుడు హరీష్ కు 600ల ఎకరాలు, బిడ్డ కవితకు 300 ఎకరాలను ఎలా సంపాదించారో బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం శాసనసభ్యులకు ఆదాయ వనరుగా మారిందన్నారు. మూడు లక్షల రూపాయల కమిషన్ ఇస్తేనే లబ్ధిదారులను దళిత బంధు పథకానికి ఎంపిక చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డాక్టరేట్ అని గర్వంగా చెప్పుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాను ఒక్కడే డాక్టరేట్ సంపాదిస్తే సరిపోదని, ప్రతి మండలంలో డిగ్రీ కాలేజ్ నిర్మిస్తామన్న ఎన్నికల హామీ నేడు ఏమైందని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించారా అని నిలదీశారు. ఓట్ల కోసం, అధికారం కోసమేనా ఆ హామీలు ఇచ్చారన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతమంది లబ్ధిదారులకు అందించారో బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన అంటూ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మానకొండూరులోని పెద్ద చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణం కాగితాల్లో, కాంట్రాక్టర్ల కమిషన్లకే పరిమితమైందని ఆరోపించారు. మానకొండూరు మండలంలోని ఈదులగట్టెపల్లి గ్రామం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దత్తత తీసుకున్నా అభివృద్ధి శూన్యమన్నారు. దత్తత గ్రామంలో పాఠశాల, రోడ్డు నిర్వహణ ఎలా ఉందో ఒకసారి సరిచూసుకోవాలని హితువు పలికారు. గ్రామ సమస్యలకు పరిష్కారం చూపలేని ఎమ్మెల్యే ఈదులగట్టెపల్లి గ్రామస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో నిర్మించిన వైకుంఠ ధామాలు నాసిరకంగా ఉన్నాయని, రోడ్లు అధ్వాన పరిస్థితుల్లోకి మారాయాని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే అర్హత భారత రాష్ట్ర సమితి నాయకులకు లేదన్నారు. పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశనం చేశారు. ఇళ్లు లేని నిరుపేదల వివరాలు సేకరించి వారికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. రాష్ట్రం అధోగతి పాలవక ముందే ప్రజలను జాగృత పరచాలన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీని ఇంటికి సాగనంపటానికి భారతీయ జనతా పార్టీ బాధ్యులు ప్రతి ఒక్కరూ ఇతోధిక కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, సాయిని మల్లేశం, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, జిల్లా అధికార ప్రతినిధులు అలివేలు సమ్మిరెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర, అసెంబ్లీ కన్వర్ ముత్యాల జగన్ రెడ్డి, నియోజవర్గ నాయకులు గడ్డం నాగరాజు, సొల్లు అజయ్ వర్మ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ,డాక్టర్ పుల్లెల పవన్ కుమార్ , ఓరం జయచందర్, శంకరపట్నం మండలాధ్యక్షులు ఏనుగుల అనిల్, తమ్మిశెట్టి మల్లన్న, మియాపూర్ లక్ష్మణాచారి, శక్తి కేంద్ర ఇంచార్జ్ వుషకోయిల శ్రీనివాస్, సహా ఇంచార్జీ కొండ్ర సురేష్, బూత్ అధ్యక్షులు నందగిరి బలరాం తదితరులు ఈ కూడలి సమావేశానికి హజరయ్యారు .