Wednesday, 4 November 2026

ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలి

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి , ఫిబ్రవరి 10 (జనంసాక్షి): ప్రతి ఒక్కరూ సేవా, సాయం చేసే గుణం కలిగి ఉండాలని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాలలో దాతల ఆర్థిక సహకారంతో నిర్మించిన నూతన హాస్టల్ గదులను దాతలు, పాఠశాల యాజమాన్యంతో కలిసి ఆమె ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ శారీరక లోపం విజయ సాధనకు ఏ మాత్రం అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి, అనుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.సాటి వారికి సాయం అందించేందుకు ముందుండాలన్నారు.పుట్టినరోజు, వివాహ వేడుకలను విద్యార్థుల మధ్య జరుపుకొని వారికి తాము ఉన్నామన్న భావన కలిగించాలని కోరారు.పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను అభినందించారు.అనంతరం దాతలను పాఠశాల నిర్వహకులు దేవులపల్లి మదనాచారి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మీలా వాసుదేవ్, వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ కలకోట లక్ష్మయ్య , కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు బిక్కుమళ్ల మంజుల ఉపేందర్, శ్రీరంగం రాము, గోలీ శ్రీనివాసరెడ్డి ,సులోచన, శర్మ , కనకయ్య , రమేష్ , పాఠశాల నిర్వహకులు దేవులపల్లి మదనాచారి,సరితా, టీచర్లు భవాని , సమత , నీరజ ,మంజుల ,గీత ,స్వరూప తదితరులు పాల్గొన్నారు.